![]() |
![]() |

అక్షయ్ కుమార్(Akshay Kumar)అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan)రితీష్ దేశ్ ముఖ్, సంజయ్ దత్, జాకీ ష్రఫ్, నర్గిస్ ఫక్రి, నానాపటేకర్, సోనమ్ బజ్వా, జాక్వలిన్ ఫెర్నాండేజ్(Jacqueline fernandez)ఫర్దీన్ ఖాన్ వంటి భారీ తారాగణం నటించిన చిత్రం 'హౌస్ ఫుల్ 5 (HouseFull 5). కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ 'హౌస్ ఫుల్' చిత్రాల సిరీస్ కి కొనసాగింపుగా తెరకెక్కింది. జూన్ 6 న థియేటర్స్ లోకి అడుగుపెట్టిన ఈ మూవీ మంచి ప్రేక్షకాదరణతో దూసుకుపోతుంది.
ఇందుకు నిదర్శనంగా కేవలం నాలుగు రోజుల్లోనే వరల్డ్ వైడ్ గా 159 .72 కోట్ల రూపాయిల క్లబ్ లో చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇందుకు ప్రధాన కారణం అగ్ర నటీనటులందరు స్క్రీన్ షేర్ చేసుకోవడం, స్క్రీన్ పై ప్రతి ఒక్కరు కూడా ఏ మాత్రం తగ్గించకండా నటించడంతో పాటు తరుణ్ మన్సుఖాని దర్శకత్వ ప్రతిభ కూడా కారణమని తెలుస్తుంది. అదే విధంగా రెండు వైవిధ్యమైన క్లైమాక్స్‌లు ఫిక్స్ చేయడం కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల్లో మూవీకి సాలిడ్ రెస్పాన్స్‌ని తెచ్చి పెట్టిందనే అభిప్రాయం ట్రేడ్ వర్గాల్లో వ్యక్తమవుతుంది.
చారిత్రాత్మక మూవీ 'చావా'(Chhaava)తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో సరైన హిట్ పడలేదు. అలాంటిది ఇప్పుడు హౌస్ ఫుల్ 5 మంచి వసూళ్లు దిశగా దూసుకుపోవడం హిందీ చిత్ర రంగానికి మంచి బూస్టప్ ని అందించిందని చెప్పవచ్చు. నడియాద్ వాలా గ్రాండ్ సన్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై 225 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన హౌస్ ఫుల్' 5 ఎండింగ్ లో ఎంత మేర కలెక్షన్స్ ని వసూలు చేస్తుందనే ఆసక్తి అందరిలో ఉంది.
![]() |
![]() |